అబ్దుల్ కలామ్ స్కూల్ లో షూటింగ్ జరుపుకున్న వరుణ్ తేజ్ సినిమా !

Published on Jul 31, 2018 9:54 am IST


మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును అందుకున్న యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పేస్ థ్రిల్లర్ సినిమాతో వరుణ్ తేజ్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. వరుణ్ తేజ్ వ్యోమగామి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవలే, ఈ చిత్రానికి సంబంధించిన చిన్న షెడ్యూల్ ను చిత్రబృందం రామేశ్వరంలో షూట్ చేసింది. మరియు లెజెండరీ సైంటిస్ట్ మరియు భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పాఠశాలలో కూడా కొన్ని కీలకమైన దృశ్యాలను చిత్రబృందం చిత్రీకరించింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే చిత్రానికి సంబంధించి 70 శాతం చిత్ర షూటింగ్ పూర్తయింది, అలాగే మిగిలిన ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్ని ఆగస్టులో పూర్తి అవుతాయని తెలుస్తోంది.

లావణ్య త్రిపాఠి , అదితి రావ్ హైదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి స్టంట్స్ మరియు విజువల్స్ హైలెట్ గా నిలవనున్నాయి. ఇందు కోసం హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన టెక్నిషన్స్ పనిచేశారు. తెలుగులో మొదటి సారి అంత్యరీక్ష నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More