మెగా హీరో ఇన్ స్టైలిష్ బ్లాక్

Published on Feb 9, 2020 3:00 am IST

మెగా హీరో వరుణ్ తేజ్ మెన్ ఇన్ బ్లాక్ లుక్ లో అదరగొట్టారు. టాప్ టు బాటమ్ ట్రెండీ డ్రెస్ లో దర్శనమిచ్చి మెస్మరైజ్ చేశారు. బెర్డ్ అండ్ పోనీ హెయిల్ స్టయిల్ లో ఆయన న్యూలుక్ ఆసక్తిరేపుతుంది. వరుణ్ ఓ ఫోటో షూట్ కోసం ఇలా ట్రెండీ అవతారం ఎత్తాడు. ఇక గత ఏడాది గడ్డలకొండ గణేష్ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ కలిగిన రోల్ చేసి మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన తదుపరి చిత్రంలో బాక్సర్ గా కనిపించనున్నారు.

నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకట్, సిద్ధూ ముద్ద ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వరుణ్ 10వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రొఫెషనల్ బాక్సర్ నీరజ్ గోయత్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :