వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ టైటిల్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Varun-Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను రివీల్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను జనవరి 19న రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. ఈ మేరకు కమెడియన్ సత్యతో ఓ ప్రమోషనల్ వీడియో కూడా రిలీజ్ చేశారు.

ఈ సినిమా కథ కొరియన్ నేపథ్యంలో సాగనుండటంతో ఈ మూవీ టైటిల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమాకు ఎలాంటి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version