ఫోటో మూమెంట్: శ్రీ నగర్ కి బయలు దేరిన వరుణ్ తేజ్!

ఫోటో మూమెంట్: శ్రీ నగర్ కి బయలు దేరిన వరుణ్ తేజ్!

Published on Feb 13, 2024 4:52 PM IST

ఫిబ్రవరి 14 న భారతీయులకు బ్లాక్ డే గా మారిపోయింది. ఫిబ్రవరి 14, 2019 లో జమ్ము మరియు కాశ్మీర్ ప్రాంతం లోని పుల్వామా లో జరిగిన టెర్రర్ ఎటాక్ లో 40 మంది CRPF జవాన్లు మరణించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యం లో రేపు ఫిబ్రవరి 14 కావడం తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ శ్రీ నగర్ కి బయలు దేరారు.

ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పుల్వామా స్మారక ప్రాంతాన్ని సందర్శించి, వీర సైనికులకు నివాళి అర్పించనున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ మార్చ్ 1, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు