నాగబాబు తనయుడు మరియు మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయం కానున్న మరో హీరో వరుణ్ తేజ్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెలుగు కుటుంబ అనుబంధాల నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 35 రోజులు కోనసీమలో షూటింగ్ జరుపుకొని చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టాకీ పార్ట్ ఈ నెలాఖరు కల్లా పూర్తి కానుంది. ఆ తర్వాత మిగిలిన ఉన్న 3 పాటలను ఆగష్టులో షూట్ చేయడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకి ‘గొల్లభామ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది కానీ ఈ చిత్ర టీం మాత్రం ఈ టైటిల్ ని ఇంకా ఖరారు చేయలేదు. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.


