వరుణ్ ‘మైత్రి’ లో సినిమా చేయనున్నాడా ?

Published on Jul 27, 2018 9:00 pm IST

‘ఫిదా , తొలిప్రేమ’ చిత్రాల రూపంలో వరుస విజయాలను ఖాతాలో వేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘ఘాజీ’ ఫెమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్ష నేపధ్యం తో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఆయన ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్ 2’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ తో కలిసి నటిస్తున్నాడు.

ఈచిత్రాల తరువాత వరుణ్ వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఒక సినిమా చేయనున్నాడని సమాచారం. ‘నేను లోకల్’ ఫెమ్ త్రినాధరావు నక్కిన ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ తో ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను పూర్తి చేసిన తరువాత వరుణ్ తేజ్ తో సినిమాను మొదలుపెట్టనున్నారట. అయితే ఈ వార్తలను ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :