వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్ : లాంచింగ్ కి రెడీ అవుతోన్న 126 అడుగుల భారీ కటౌట్

వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్ : లాంచింగ్ కి రెడీ అవుతోన్న 126 అడుగుల భారీ కటౌట్

Published on Jan 18, 2024 8:03 PM IST

యువ నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మానుషీ చిల్లార్ హీరోయిన్ గా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఈ మూవీని సోనీ పిక్చర్స్, రెనైసెన్స్ పిక్చర్స్, మరియు గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి సంయుక్తంగా గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి మీక్కి జె మేయర్ సంగీతం అందిస్తన్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ వందేమాతరం అందరి నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. విషయం ఏమిటంటే, రేపు వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఉదయం 11 గం. లకు సూర్యాపేట లోని రాజుగారి తోట ప్రాంతంలో 126 అడుగుల ఆయన భారీ కటౌట్ ని ఏర్పాటు చేయనున్నారు. అక్కడికి విశేషంగా ఫ్యాన్స్ ఆడియన్స్ తరలిరానున్నారు. మొత్తంగా అయితే ఈ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ గా మారింది. కాగా తెలుగు, హిందీ బైలింగువల్ గా రూపొందుతున్న ఆపరేషన్ వాలెంటైన్ మూవీని ఫిబ్రవరి 9న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు