హరీష్ వాల్మీకిలో వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ అలా సెట్ చేశాడా?

హరీష్ వాల్మీకిలో వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ అలా సెట్ చేశాడా?

Published on Sep 2, 2019 12:30 PM IST

కొత్తగా విడుదలైన వాల్మీకి పోస్టర్స్ లో వరుణ్ లుక్ 90లనాటి లవర్ బాయ్ గెటప్ లో ఆసక్తికరంగా ఉంది. ఇప్పటివరకు జులపాలు, నల్ల బట్టలు మెడలో దండలతో ఉరమాస్ గ్యాంగ్ స్టర్ లుక్ లో దర్శనమిచ్చిన వరుణ్ ఈ కొత్త లుక్ ఆసక్తిని రేపుతోంది.దీనితో అసలు వాల్మికీలో వరుణ్ ఎన్ని షేడ్స్ లో కనిపించనున్నాడు అనే ఆసక్తికలుగుతుంది.

అలాగే వరుణ్ కి జోడిగా నటిస్తున్న పూజా లుక్ కూడా లంగా ఓణీ, రెండు జడలతో ఆకాలపు అమ్మాయి లుక్ లో కనిపించడంతో వీరిద్దరి మధ్య దర్శకుడు హరీష్ రొమాంటిక్ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ సెట్ చేశాడు అనిపిస్తుంది. కర్కశుడైన వరుణ్ కి ఫ్లాష్ బ్యాక్ లో పూజా తో మంచి రొమాంటిక్ లవ్ ఎపిసోడ్ ని హరీష్ డెవలప్ చేశాడేమో చూడాలి. ఎందుకంటే వాల్మీకి మాతృకైన తమిళ చిత్రం జిగర్తాండాలో వరుణ్ చేస్తున్న పాత్రకి హీరోయిన్ ఉండదు.

ఏదిఏమైనా 20ఏళ్ల కిందటి యంగ్ కపుల్ లుక్ లో వరుణ్ పూజా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. 14రీల్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా,ఈనెల 20న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు