“ఫైటర్” డైరెక్టర్ కాంట్రవర్సీపై వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

“ఫైటర్” డైరెక్టర్ కాంట్రవర్సీపై వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Feb 25, 2024 5:11 PM IST


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “ఆపరేషన్ వాలెంటైన్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం రీసెంట్ గా వచ్చిన బాలీవుడ్ భారీ చిత్రం “ఫైటర్” తరహాలో ఉందని కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. అయితే ఫైటర్ చిత్ర దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ సినిమా రిలీజ్ అయ్యాక ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తో అయితే చేసిన కొన్ని కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి.

ఇండియాలో చాలా వరకు పాపులేషన్ అసలు ఫ్లైట్ జర్నీ నే చెయ్యలేదు అని అందుకే నా సినిమా అర్ధం కాలేదు అంటూ చేసిన కామెంట్స్ ఏ రెండు రోజులు పాటు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. అయితే ఈ అంశంపై వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. తాను ఆ కామెంట్స్ విషయంలో ఏమి మాట్లాడనని ఎందుకంటే సిద్ధార్థ్ లాంటి పెద్ద డైరెక్టర్ ఆ కామెంట్స్ ముందు కానీ తర్వాత కానీ ఏమన్నారో తెలీదు. అందరి లానే నేను కూడా ఆ చిన్న క్లిప్ మాత్రానే చూశానని సో తాను మాట్లాడ్డానికి ఏమి లేదని క్లీన్ ఆన్సర్ ఇచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు