మెగాస్టార్ సినిమాలో సీనియర్ హీరోయిన్ ?

మెగాస్టార్ సినిమాలో సీనియర్ హీరోయిన్ ?

Published on Dec 11, 2023 8:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఐతే, ఈ చిత్రంలో నటించే హీరోయిన్ పై ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. కానీ, ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఐతే, త్రిష మెగాస్టార్ సరసన నటిస్తే బాగుంటుంది అంటూ మెగా ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఈ సినిమాలో మెగాస్టార్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఆయన పాత్ర అలాగే ఉంటుంది అని, దానితో పాటుగా అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఉంటుంది అని వశిష్ట చెప్పుకొచ్చాడు. ఇక ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు