విజయ్ – గౌతమ్ తిన్ననూరి మూవీ కొత్త షెడ్యూల్ అప్పటి నుండే

విజయ్ – గౌతమ్ తిన్ననూరి మూవీ కొత్త షెడ్యూల్ అప్పటి నుండే

Published on Jan 17, 2024 12:01 PM IST

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ హీరో నెక్స్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ చిత్రం లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో ఒక చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ పై మరోసారి క్లారిటీ వచ్చింది. ఫ్యామిలీ స్టార్ట్ పూర్తి అయిన తర్వాత విజయ్ మార్చ్ 2024 నుండి VD 12 షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు.

భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ థ్రిల్లర్‌ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు