ఎనిమిదేళ్ల తర్వాత వచ్చిన ఆమెకు బ్రేక్ దొరుకుతుందా ?

ఎనిమిదేళ్ల తర్వాత వచ్చిన ఆమెకు బ్రేక్ దొరుకుతుందా ?

Published on Dec 17, 2019 1:03 AM IST

Vedhika

నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘రూలర్’. ఇందులో వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లు. వీరిలో వేదిక చాన్నాళ్ల తరువాత చేసిన డైరెక్ట్ తెలుగు సినిమా ఇదే. 2007లో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ చేసిన ‘విజయదశమి’ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత ‘బాణం’ సినిమా చేసి చివరగా 2011లో వచ్చిన ‘దగ్గరగా దూరంగా’లో మెరిసింది. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు.

మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఈ ‘రూలర్’ చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంపై ఆమె భారీగానే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా విజయం సాధిస్తే తెలుగులో మరిన్ని అవకాశాలు దక్కుతాయని భావిస్తోంది. మరి ఈ చిత్రం ఆమెకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 20న భారీ స్థాయిలో విడుదల కానుంది.

తాజా వార్తలు