తెరపైకి ప్రథమ భూదాత వెదిరె రామచంద్రారెడ్డి బయోపిక్..!

ఆనాడు భూమి లేని పేదలందరికి భూమి ఇవ్వాలన్న సంకల్పంతో గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబా భావే భూధానోద్యమాన్ని స్థాపించి దాని ద్వారా లక్షల ఎకరాల భూమిని సేకరించి పేదలకు పంచిపెట్టాడు. అయితే వినోబా భావే వంటి మహనీయుడు పేదలకు భూ పంపిణీ కోసం అని అడగ్గానే ప్రథమ భూదాతగా తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి తన వంద ఎకరాల భూమిని దానంగా ఇచ్చి మంచి మనసు చాటుకున్నాడు. అయితే ప్రథమ భూదాతగా భూ పంపిణీకి స్ఫూర్తినిచ్చిన వెదిరె రామచంద్రారెడ్డి జీవిత కథను తెరపైకి తీసుకురాబోతున్నారు.

అయితే నీలకంఠ దర్శకత్వంలో, రామచంద్రా రెడ్డి మనవడు అరవింద్‌ రెడ్డి సమర్పణలో, నటుడు అల్లు అర్జున్‌ మావయ్య కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయని, త్వరలోనే నటీనటులను ఎంపిక చేసి, షూటింగ్‌ ప్రారంభిస్తామని దర్శక నిర్మాతలు చెప్పుకొచ్చారు.

Exit mobile version