జూలై 18న రిలీజ్ కానున్న ‘వీడే మన వారసుడు’ చిత్రం

veede

రైతుల జీవితాలపై ఆధారపడి రూపొందిన సందేశాత్మక చిత్రం ‘వీడే మన వారసుడు’. రమేష్ ఉప్పు(RSU) కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వంతో పాటు హీరోగా కూడా నటించిన ఈ సినిమా తుది మెరుగులు దిద్దుకుంటోంది. రమేష్ ఉప్పు (RSU)కు జోడిగా లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ న‌టించారు. అర్.ఎస్. ఆర్ట్స్ బ్యానర్‌పై రూపోందిన ఈ చిత్రానికి శ్రీమతి యు.రమాదేవి సమర్పకురాలుగా వ్యవహారిస్తున్నారు. సమ్మెట‌ గాంధీ, విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్, శిల్ప (వైజాగ్) కీలక పాత్రలు పోషించారు. జూలై 18న తెలుగు రాష్ట్రాల‌లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు.

తాజాగా ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించారు. కుటుంబం, రైతుల పోరాటం, యువతపై మాదకద్రవ్యాల ప్రభావం వంటి అంశాలను సమర్థవంతంగా చిత్రీకరించినందుకు ప్రశంసలు లభించాయి.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శక‌నిర్మాత రమేష్ ఉప్పు(RSU) మాట్లాడుతూ.. ‘స‌మాజానికి మంచి సందేశం అందిస్తుంది మా సినిమా. ఇందులోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరిని క‌దిలిస్తాయి. సెన్సార్ బోర్డు స‌భ్యుల‌తో పాటు, ప్రీమియ‌ర్ షో చూసిన ప‌లువురు ప్రముఖులు సినిమాపై ప్రశంస‌లు కురిపించ‌డంతో మా న‌మ్మకం మ‌రింతా పెరిగింది. మా శ్రమ‌కు మంచి సక్సెస్ అందుతుందనే నమ్మకం బ‌లంగా ఉంది. రైతుల కష్టాలను అర్థవంతంగా ఆవిష్కరించిన‌ ఈ కుటుంబ క‌థా చిత్రాన్ని థియేట‌ర్‌కు వెళ్లి చూడాల‌ని ప్రేక్షకుల‌కు విజ్ఞప్తి చేస్తున్నాను.’ అని చెప్పారు.

ఈ నెల 29న మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రముఖులకు ప్రీమియర్ షో ఏర్పాటు చేయగా, చూసినవారంతా సినిమా బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు. సినిమాపై బజ్ పెంచేందుకు యూనిట్ ప్రమోషన్స్‌ ప్రారంభించింది.

Exit mobile version