
‘భాయ్’ సినిమా దర్శకుడు వీరభధ్రమ్ చౌదరి చెప్పిన కథకు యువ హీరో ఆది గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ న్యూస్. ఈ కథ ప్రముఖ నిర్మాత అనిల్ సుంకరకు కూడా బాగా నచ్చిందట. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తారని సమాచారం. లవ్ & యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
ఆది, మదన్ దర్శకత్వం వహిస్తున్న ‘గరమ్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత వీరభధ్రమ్ చౌదరి సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. హిట్ సినిమా ‘అహనా పెళ్లంట’తో దర్శకుడిగా పరిచయమైన వీరభధ్రమ్, తర్వాత ‘పూల రంగడు’ వంటి మరో హిట్ సినిమాను అందించాడు. అయితే ‘భాయ్’ సినిమా చేదు ఫలితం అందించింది. ఆది సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని.. కొంత గ్యాప్ తీసుకుని, మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.