అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేసిన చిత్రం ‘ఎఫ్ 2’. గతేడాది సంక్రాంతికి విడుదలైన చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది. ఈ విజయంతో వెంకీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే సీక్వెల్ చేయాలని అనుకున్నారు టీమ్. ఈ సీక్వెల్ కోసం అప్పటి నుండే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు కూడ.
అనిల్ రావిపూడి కొన్ని స్క్రిప్ట్స్ వినిపించారని, వాటిలో ఏ కథను సీక్వెల్ చేయాలో ఇంకా ఫైనల్ చేయలేదని అంటున్న వెంకీ అందులో లీడ్ రోల్స్ తాను, వరుణ్ చేస్తామని, హీరోయిన్లను కూడా ఫైనల్ చేయాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ‘సరిలేర నీకెవ్వరు’ విడుదల సన్నాహల్లో ఉండగా వెంకీ ‘అసురన్’ తెలుగు రీమేక్ స్టార్ట్ చేయనున్నారు. అలాగే వరుణ్ ఒక స్పోర్ట్స్ డ్రామా చిత్రీకరణలో బిజీగా గడుపుతున్నారు. బహుశా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఒక కొలిక్కి రాగానే సీక్వెల్ పనులు మొదలయ్యే అవకాశం ఉంది.


