మల్లీశ్వరి సినిమా పై వెంకీ మామ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

మల్లీశ్వరి సినిమా పై వెంకీ మామ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Published on Feb 18, 2024 9:25 PM IST

Venkatesh
టాలీవుడ్ స్టార్ హీరో, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కే. విజయ్ భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మల్లీశ్వరి. ఈ చిత్రం 2004 లో థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హీరో వెంకటేష్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేశారు.

పెళ్ళికాని ప్రసాద్ పాత్ర గురించి ప్రస్తావించారు. అంతేకాక సినిమాకి సంబందించిన కొన్ని క్లిప్స్ ను మిక్స్ చేస్తూ, ఒక వీడియో ను రిలీజ్ చేశారు. ఇది ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. నరేష్, కత్రీనా కైఫ్, సునీల్, కోట శ్రీనివాస రావు, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, గజాల తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కోటి సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు