
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న కొత్త చిత్రాల్లో ‘ఎఫ్ 3’ ఒకటి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. వెంకీలోని ఫన్ ఎలిమెంట్ ఛాన్నాళ్ల తర్వాత బయటపడింది ‘ఎఫ్ 2’తోనే. అందులో వెంకీ చేసిన ఫన్ ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించింది. అందుకే ‘ఎఫ్ 3’ చేస్తున్నారు. ఇందులో వెంకీ పాత్రకు ‘ఎఫ్ 2’కు మించి ఫన్ టచ్ ఇచ్చారట అనిల్ రావిపూడి. సినీ వర్గాల సమాచారం మేరకు ఇందులో వెంకీకి రేచీకటి సమస్య ఉంటుందట.
ఈ సమస్య మీదనే బోలెడంత ఫన్ జెనరేట్ చేస్తున్నారని, కళ్ళు కనిపించక వెంకీ చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుందని అంటున్నారు. మరి ఆ కామెడీ ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే. ఇందులో వరుణ్ తేజ్ కూడ ఒక కీ రోల్ చేస్తున్నారు. ‘ఎఫ్ 2’ చిత్రం భార్య, భర్తల నేపథ్యంలో తెరకెక్కితే ఈ సీక్వెల్ మాత్రం మనీ నేసథ్యంలో ఉండనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 27న రిలీజ్ కానుంది. తమన్నా, మెహ్రీన్ ఇందులో కథానాయికలు.