మరో మలయాళ రీమేక్ లో వెంకటేష్.!

మరో మలయాళ రీమేక్ లో వెంకటేష్.!

Published on Jun 16, 2015 3:09 PM IST

Venkatesh
సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సినిమా ‘గోపాల గోపాల’. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత వెంకటేష్ మరే సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళలేదు. గతంలో వెంకటేష్ నటించిన లక్ష్మీ సినిమాకి కథని అందించిన ఆకుల శివ ప్రస్తుతం వెంకటేష్ కోసం ఓ కథని రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా జూలైలో ప్రారంభం కానుంది. ఇది కాకుండా మరో సినిమాకి కూడా వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

అది కూడా ఓ మలయాళ రీమేక్ సినిమాకి ఓకే చెప్పడం విశేషం. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి – నయనతార జంటగా నటించిన ‘భాస్కర్ ది రాస్కెల్’ అనే సినిమా ఈ ఏడాది ఏప్రిల్ లో మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. విశ్వసనీయ వర్గాలు చెప్పిన సమాచారం ప్రకారం భాస్కర్ ది రాస్కెల్ రీమేక్ రైట్స్ ని సురేష్ బాబు సొంతం చేసుకున్నాడు. సురేష్ బాబు ఈ సినిమాని వెంకటేష్ – నయనతారలతో తీయాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారు, ఇంకా ఎవరెవరు ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతారు అనే దానిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

గత ఏడాది వెంకటేష్ మలయాళంలో హిట్ అయిన దృశ్యం సినిమాని అదే పేరుతో రీమేక్ చేసారు. ఆ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. దృశ్యం లానే ఈ మలయాళ సినిమా కూడా తెలుగులో వర్కౌట్ అవుతుందని సురేష్ బాబు నమ్మకంగా ఉన్నారు.

తాజా వార్తలు