తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘అసురన్’ను తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ జనవరి నుండి మొదలుకానుంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గర్నుండి ధనుష్ పాత్రలో వెంకీ ఎలా కనబడతారో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.
వెంకీ కూడా ఇటీవలే ముంబై వెళ్లి లుక్ టెస్ట్ చేయించుకున్నారు. చిత్ర బృందం సమాచారం మేరకు కథానాయకుడి పాత్ర కోసం వెంకీ ట్రై చేసిన లుక్ చాలా బాగా వచ్చిందని, చిన్న చిన్న మార్పులతో దాన్నే ఫైనల్ చేశారని, ఆ లుక్లో వెంకీ చాలా కొత్తగా కనిపిస్తారని చెప్పుకొచ్చారు. అలాగే ఒరిజినల్ వెర్షన్లో ధనుష్ లుక్ తమిళ నేటివిటీని ఎలాగైతే ప్రతిబింబిస్తుందో తెలుగు రీమేక్లో వెంకీ లుక్ కూడా అలాగే పూర్తి తెలుగుదనాన్ని కలిగి ఉంటుందని ధీమాగా చెబుతున్నారు.
