‘మర్మాణువు’తో కాక రేపుతున్న రాజశేఖర్

marmanavu

సీనియర్ హీరో రాజశేఖర్ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాకు దర్శకుడు. వెంకటేష్ మహా తన రెండవ చిత్రంగా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ అనే రీమేక్ సినిమాను చేసినా మూడవ చిత్రాన్ని మాత్రం సొంత కథతోనే చేయనున్నారు. అదే ‘మర్మాణువు’. ఈ సాయంత్రమే సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తలపాగ చుట్టిన పుర్రె బొమ్మతో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని కలుగజేస్తోంది. అసలు కథలో రాజశేఖర్ పాత్ర ఎలా ఉండబోతుంది అనే ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.

విజయ ప్రవీణ పరుచూరితో కలిసి రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడుతూ కథ, కథనాలు అన్ని భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా ఉన్నాయని, సినిమాలో రాజశేఖర్ గారి క్యారెక్టర్ సంథింగ్ స్పెషల్ అని అన్నారు. మొదటి సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’తో మంచి ఫిల్మ్ మేకర్ అని పేరు తెచ్చుకున్న వెంకటేష్ మహా ఈ కొత్త సినిమాతో ఎంత మెప్పిస్తారో చడాలి.

Exit mobile version