పెళ్లి కొడుకుగా వెంకటేష్..వైరల్ అవుతున్న ఫోటో

Published on Jun 3, 2020 8:56 pm IST


విక్టరీ వెంకటేష్ పెళ్ళినాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇరవై ఏళ్ల ప్రాయంలో పెళ్లి కుమారుడిగా వెంకటేష్ ఇన్నోసెంట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. విదేశాలలో చదువు పూర్తి చేసుకొని వచ్చిన వెంకటేష్ 1985లో నీరజను పెళ్లి చేసుకున్నారు. అప్పటికి వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. పెళ్లి అయిన ఏడాదికి 1986లో ఆయన మొదటి చిత్రం కలియుగ పాండవులు విడుదల అయ్యింది.

గత ఏడాది ఎఫ్2, వెంకీ మామ చిత్రాలతో హిట్స్ అందుకున్న ఆయన ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప మూవీ చేస్తున్నారు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 మూవీ చేయనున్నారు. పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ సైతం ఆయనతో మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More