నాగార్జున, వెంకటేష్ టీంల మధ్య ఫైనల్ మ్యాచ్

నాగార్జున, వెంకటేష్ టీంల మధ్య ఫైనల్ మ్యాచ్

Published on Nov 30, 2014 6:53 PM IST

venkey-nagarjuna
విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టీంల మధ్య జరిగిన రెండవ క్రికెట్ మ్యాచ్ లో ….. టీం విజయం సాధించింది. టాస్ నెగ్గిన వెంకటేష్ టీం మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 6 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 69 పరుగులు చేసింది. రామ్ చరణ్ టీం 6 ఓవర్లలో కేవలం పరుగులు 56 మాత్రమే చేసింది. 14 పరుగుల తేడాతో వెంకటేష్ టీం విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో రామ్ చరణ్ మూడు క్యాచ్ లు పట్టడంతో పాటు ఒక స్టంప్ అవుట్ చేయడం విశేషం.

ఇప్పుడు నాగార్జున, వెంకటేష్ టీంల మధ్య సూపర్ సిక్స్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అభిమానులు ఈ క్రికెట్ మ్యాచ్ లను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ రోజు ఉదయం నుండి తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు నిర్విరామంగా ‘మేము సైతం – వుయ్ లవ్ వైజాగ్’ ఈవెంట్ లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులను సియం రిలిఎఫ్ ఫండ్ కు అందజేస్తారు.

‘మేము సైతం’ క్రికెట్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వీడియో చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

తాజా వార్తలు