రేస్ క్లబ్ లో వెంకీ కొత్త సినిమా నిజమేనా ?

రేస్ క్లబ్ లో వెంకీ కొత్త సినిమా నిజమేనా ?

Published on Oct 20, 2019 10:20 PM IST

‘ఎఫ్ 2’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్ తన తరువాత సినిమాల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ పూర్తి చేసే పనిలో ఉన్న ఈ సీనియర్ హీరో .. ఇప్పటికే దర్శకులు తరుణ్ భాస్కర్, త్రినాథరావ్ నక్కిన ప్రాజెక్ట్స్ ఓకే చేశారట. వాటిలో ముందుగా తరుణ్ భాస్కర్ సినిమా మొదలవుతుందని ఇటీవలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నేపథ్యం కాస్త కొత్తగా ఉండబోతుందట. హార్స్ రెసింగ్ నెపథ్యంలో ఈ సినిమా సాగుతుందని.. వెంకీ క్యారెక్టర్ చాల కొత్తగా ఉంటుందని వినికిడి. ఈ సినిమా చాలా వరకు రేస్ క్లబ్ లోనే చిత్రీకరిస్తారట. మరి ఈ వార్తల్లో ఏమేరకు నిజముందో తెలియాలంటే ఆఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇకపోతే ఈ చిత్రాన్ని వెంకీ హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. కాగా ఇక వెంకటేశ్‌, నాగచైతన్య, ఆన్ స్క్రీన్ మామ అల్లుళ్లుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ వెంకీమామ నుండి దసరా పండుగ పురస్కరించుకొని విడుదలైన ‘వెంకీ మామ’ చిత్రానికి సంబందించిన ఫస్ట్ గ్లిమ్స్ వీడియో బాగా ఆకట్టుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు