వెంకీ కొత్త సినిమా కూడా ఫుల్ ఫన్ తోనే !

వెంకీ కొత్త సినిమా కూడా ఫుల్ ఫన్ తోనే !

Published on Aug 1, 2019 12:01 AM IST

‘ఎఫ్ 2’తో అద్భుతమైన కామెడీని పండించారు విక్టరీ వెంకటేష్. మళ్లీ అలాంటి కామెడీ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి వెంకీ సిద్దమైనట్లు తెలుస్తోంది. నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో చెయ్యబోయే సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తి అయిందట. స్క్రిప్ట్ లో కామెడీ సీన్స్ చాల బాగుంటాయని.. ముఖ్యంగా వెంకేటేష్ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందని సమాచారం.

కాగా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమా నవంబర్ లో మొదలుకానుంది. ఇక త్రినాథరావ్ నక్కిన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి సినిమాలు మంచి ఎంటెర్టైమెంట్ తో సాగిన విషయం తెలిసిందే. దాంతో ఈ సినిమాను కూడా ఫుల్ ఫన్ తో త్రినాథరావ్ నక్కిన తెరకెక్కించనున్నారు.

ఈ సినిమాను సురేష్ బాబు నిర్మిస్తారు. ప్రస్తుతం వెంకీ బాబీ దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగచైతన్య కాంబినేషన్ లో ‘వెంకీ మామ’ మల్టీ స్టారర్ లో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు