వెంకీని మెప్పించిన కామెడీ డైరెక్టర్ !

Published on May 28, 2019 2:30 am IST

విక్టరీ వెంకటేష్ వెంకీమామ తరువాత నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్ టైనర్ చెయ్యబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫుల్ స్క్రిప్ట్ పూర్తి అయింది. స్క్రిప్ట్ మొత్తం విన్న వెంకీ, సినిమాలో కామెడీ చాలా బాగుందని పేపర్ మీద ఉన్న కంటెంట్ అలాగే సేమ్ స్క్రీన్ మీదకు గాని ప్రెజెంట్ చేయగలిగితే.. సినిమా బ్లాక్ బ్లస్టర్ అవ్వడం గ్యారంటీ అన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ కామెడీ డైరెక్టర్ వెంకీని మెప్పించాడు.

కాగా సినిమాలో వెంకేటేష్ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందట.. అలాగే హీరోయిన్ తో సాగే లవ్ స్టోరీ కూడా ఇంట్రస్టింగ్ గా ఉంటుందని సమాచారం. ఎలాగూ త్రినాథరావ్ నక్కిన కామెడీని బాగా డీల్ చేస్తాడని మంచి పేరు ఉంది. ఆయన గత చిత్రాలు ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి సినిమాలు మంచి ఎంటెర్టైమెంట్ తో సాగిన విషయం తెలిసిందే. అదే విధంగా ఈ సినిమాను పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిచనున్నారు. ఇక ఈ సినిమాను సురేష్ బాబు నిర్మిస్తారు.

సంబంధిత సమాచారం :

More