మహేష్, వరుణ్ లకు వెంకటేష్ ఛాలెంజ్

మహేష్, వరుణ్ లకు వెంకటేష్ ఛాలెంజ్

Published on Apr 23, 2020 12:03 PM IST

రియల్ మెన్ ఛాలెంజ్ లో భాగంగా వెంకటేష్ తన టాస్క్ పూర్తి చేశారు. ఆయన ఇల్లు తుడవడం, గార్డెనింగ్ మరియు వంటకూడా చేశారు. ఇంటిపనులలో కుటుంబానికి అండగా ఉందాం అని సందేహం ఇచ్చారు. ఆయన ఈ వీడియోని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇక ఆయన రియల్ మెన్ ఛాలెంజ్ ని సూపర్ స్టార్ మహేష్, మెగా హీరో వరుణ్ తేజ్ మరియు దర్శకుడు అనిల్ రావిపూడికి విసిరాడు.

మరి ఈ ఛాలెంజ్ చిన్నోడు మహేష్, కోబ్రా వరుణ్ ఎలా స్వీకరించి పూర్తి చేస్తారో చూడాలి. రాజమౌళి నుండి ఛాలెంజ్ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ మరియు బాలకృష్ణను నామినేట్ చేశారు. ఇప్పటికే చిరంజీవి ఈ రియల్ మెన్ ఛాలెంజ్ పూర్తి చేయగా, వెంకీ కూడా పూర్తి చేసి రియల్ మెన్ గా నిరూపించుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు