‘సంక్రాంతికి వస్తున్నాం’ భారీ విజయం తర్వాత విక్టరీ వెంకటేష్ కొంత విరామం తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ షూటింగ్‌లతో బిజీ అయ్యారు. చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో వెంకటేష్ కీలకమైన ఎక్స్‌టెండెడ్ క్యామియోలో కనిపించనున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగే ఈ పాత్రతో సినిమా మరింత ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్‌ను వెంకటేష్ ఇటీవల ప్రారంభించారు. ఈ సినిమాను సమ్మర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మార్చి నాటికి షూటింగ్ పూర్తి చేయాలనే ఆలోచనలో వెంకీ ఉన్నారు.
దీంతో పాటు వెంకటేష్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘దృశ్యం-3’ తెలుగు వెర్షన్ కూడా చేయనున్నారు. వెంకటేష్ డేట్స్ ఇచ్చిన తర్వాత తెలుగు షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాను కూడా ఈ ఏడాదే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మొత్తంగా 2026లో వెంకటేష్ మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు.


