థ్రిల్లర్ కోసం వెయిట్ తగ్గుతున్న వెంకటేష్

థ్రిల్లర్ కోసం వెయిట్ తగ్గుతున్న వెంకటేష్

Published on Feb 10, 2015 11:59 PM IST

venkatesh
విక్టరీ వెంకటేష్ కానుకగా ‘గోపాల గోపాల’ సినిమాని రిలీజ్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత వెంకటేష్ మరో సినిమా ఇంకా సెట్స్ పైకి తీసుకెళ్లకుండా తన వయసుకి సరిపోయేలా డిఫరెంట్ పాత్రలున్న సినిమా స్క్రిప్ట్ లను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. అందులో ముందుగా తమిళ డైరెక్టర్ ఎన్.వి నిర్మల్ కుమార్ చెప్పిన స్టొరీ లైన్ బాగా నచ్చడంతో అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెంకటేష్ కి స్టొరీ లైన్ బాగా నచ్చడంతో ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో రమ్మని వెంకటేష్ నిర్మల్ కుమార్ కి చెప్పాడట. ప్రస్తుతం నిర్మల్ కుమార్ పూర్తి స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో ఉన్నాడు.

ఈ సినిమాలో వెంకటేష్ కాస్త స్లిమ్ గా కనిపించాలి. అందులో భాగంగానే వెంకటేష్ ప్రస్తుతం తన వైట్ తగ్గించే పనిలో ఉన్నాడు. నిర్మల్ కుమార్ చెప్పిన కథలో తెలుగు ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉంటూనే అదిరిపోయే థ్రిల్లింగ్ మోమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం. గత సంవత్సరం వెంకటేష్ ట్రై చేసిన దృశ్యం సినిమా కూడా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన థ్రిల్లర్ మూవీ. ఆ సినిమా మంచి సక్సే అయ్యింది. తమిళ వాడైన నిర్మల్ కుమార్ మొదటి సినిమా ‘సలీం’. విజయ్ అంథోని నటించిన ఈ సినిమా తమిళంలో మంచి విజయం అందుకుంది. త్వరలోనే వెంకటేష్ – నిర్మల్ కుమార్ సినిమా గురించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

తాజా వార్తలు