‘ఆదర్శకుటుంబం’ పై లేటెస్ట్ అప్ డేట్

Aadarsha-Kutumbam-House

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న ఆదర్శకుటుంబం చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో భారీ ఇంటి సెట్ వేస్తున్నారు. ఈ భారీ సెట్ లో కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఈ నెల నాలుగో వారం నుంచి ఈ ఇంట్లో షూట్ ను స్టార్ట్ చేయనున్నారు. ఈ షూట్ అనంతరం విదేశాల్లో సాంగ్స్ షూటింగ్ ను జరుపుకోనున్నారు. కేవలం పాటల కోసం మాత్రమే విదేశాలకు చిత్రబృందం వెళ్తుందట.

ఇక నాణ్యత విషయంలో త్రివిక్రమ్ ఎక్కడా రాజీ పడటం లేదు. అనుకున్న సమయానికే సినిమాను పూర్తి చేసి వేసవి వినోదాన్ని అందించాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. అన్నట్టు త్రివిక్రమ్‌, వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ తదితర చిత్రాలకు రచయితగా పని చేశారు. ఈ కాంబినేషన్‌లో మూవీని ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా నిర్మాణ సంస్థ హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతుంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Exit mobile version