‘అసురన్’ స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారా ?

‘అసురన్’ స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారా ?

Published on Nov 23, 2019 1:00 AM IST

తమిళ హిట్ చిత్రం ‘అసురన్’ను తెలుగులో వెంకటేష్ హీరోగా సురేష్ బాబు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నారు. ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన ఈ అసురన్ సినిమాని తెలుగులో కొన్ని మార్పులు చేసి తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాల స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారట. ముఖ్యంగా వెంకటేష్ శైలికి తగ్గట్లుగా స్క్రిప్ట్ కి మార్పులు చేస్తున్నారట.

ఇక ‘ఎఫ్ 2’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్ తన తరువాత సినిమాల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. అలా అసురన్ సినిమాని తెలుగులో రీమేక్ చేసున్నారు. ఈ మధ్య కాలంలో కేవలం కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే చేస్తున్న హీరో వెంకటేష్ కి ఈ అసురన్ బాగా సెట్ అవుతుందని ఫీల్ అవుతున్నారు మేకర్స్. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.

ఇక వెంకటేష్ ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు