తేజ దర్శకత్వంలో వెంకటేష్ నటించబోతున్న ‘ఆటా నాదే వేటా నాదే’ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 26న ప్రారంభంకానుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను సురేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల బయటికి వచ్చిన వెంకటేష్, నారా రోహిత్ లుక్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది.
శ్రియ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర వర్గాల సమాచారం. నారా రోహిత్ ఈ మూవీలో వెంకటేష్ బావమరిది పాత్రలో కనిపించబోతున్నాడు. ఇషా రెబ్బ మరో కథానాయికగా అలరించబోతోంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరింత సమాచారం త్వరలో తెలియనుంది.
