షూట్ ప్లాన్ చేసుకున్న వెంకీ ‘అసురన్’ !

షూట్ ప్లాన్ చేసుకున్న వెంకీ ‘అసురన్’ !

Published on Dec 8, 2019 6:15 PM IST

తమిళ హిట్ చిత్రం ‘అసురన్’ను తెలుగులో వెంకటేష్ హీరోగా సురేష్ బాబు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ జనవరిలో ప్రారంభించి.. మొత్తం నాలుగు నెలల్లో సినిమాను పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రయూనిట్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇక ‘ఎఫ్ 2’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్ తన తరువాత సినిమాల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. అలా అసురన్ సినిమాని తెలుగులో రీమేక్ చేసున్నారు.

కాగా ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు. ఇక వెంకటేష్ ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు