‘లక్కీ భాస్కర్’ సీక్వెల్ పై వెంకీ అట్లూరి క్లారిటీ..!

‘లక్కీ భాస్కర్’ సీక్వెల్ పై వెంకీ అట్లూరి క్లారిటీ..!

Published on Jul 30, 2026 4:25 PM IST

టాలీవుడ్‌లో సక్సె్స్‌ఫుల్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి తన కొత్త చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘లక్కీ భాస్కర్’ చిత్ర సీక్వెల్ గురించి ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

‘లక్కీ భాస్కర్’ సీక్వెల్ కంటే ముందు ఆయన మరో రెండు సినిమాలు చేయబోతున్నాడని.. ఒకటి ధనుష్‌తో కాప్ యాక్షన్ డ్రామా, మరొకటి ‘హోమ్ అలోన్’ శైలిలో ఉండే ‘చిల్డ్రన్స్ అడ్వెంచర్’ మూవీ అని వెంకీ అట్లూరి తెలిపాడు.

‘లక్కీ భాస్కర్’ భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయని, స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేసుకున్నాకే సెట్స్ పైకి వెళ్తానని వెంకీ తెలిపారు. దీంతో దుల్కర్ సల్మాన్ కాంబినేషన్లో రాబోయే ఈ క్రేజీ సీక్వెల్ కోసం అభిమానులు మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు