నైజాంలో మామ అల్లుళ్ళు నాలుగో రోజు ఎంత రాబట్టారంటే..!

VenkyMama 3

వెంకటేష్, నాగచైతన్య మామా అల్లుళ్లుగా వచ్చిన ‘వెంకీ మామ’ మూవీ గతవారం సోలో గా విడుదలైంది. అలాగే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓపెనింగ్స్ తో పాటు వీకెండ్ వరకు మంచిగానే వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా నైజాంలో వెంకీ మామ మూవీ వసూళ్లు ఆశాజనకంగా కొనసాగుతున్నాయి. ఇక నిన్న సోమవారం కావడంతో వెంకీ మామ చిత్ర వసూళ్ళలో స్వల్ప తగ్గుదల కనిపించింది. అయినప్పటికీ సోమవారం నైజాంలో వెంకీ మామ దాదాపు 80లక్షల షేర్ రాబట్టినట్టు సమాచారం.

ఇక నాలుగు రోజులకు గాను వెంకీ మామ నైజాంలో 7. 32 కోట్ల షేర్ రాబట్టింది. ఐతే వెంకీ మామ ఈ వారంలోనే ఎక్కువ వసూళ్లు రాబట్టుకోవాలి. ఎందుకనగా వచ్చే వారం బాక్సఫీస్ దగ్గర నాలుగు చిత్రాలు విడుదల అవుతూ ఉండగా వాటిలో ఒకటి బాలయ్య నటించిన రూలర్. అలాగే సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండుగే మరియు సల్మాన్ ఖాన్ దబాంగ్ 3, కార్తీ నటించిన దొంగ విడుదల అవుతున్నాయి. కాబట్టి ఈ నూతన చిత్రాల నుండి తీవ్ర పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. మరి వెంకీ మామ ఈ వారం వసూళ్లు గుంజి బయ్యర్లను బయటపడేస్తాడో లేదో చూడాలి.

Exit mobile version