వెంకీ మామ మొదటి వారం నైజాంలో ఎంత కొట్టాడంటే..!

VenkyMama 5

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు చేసిన వెంకీ మామ గతవారం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఆఫ్ స్క్రీన్ మామ అల్లుళ్ళ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పై బాగా పేలింది. దీనితో వెంకీ మామ టీం సూపర్ హ్యాపీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో విజయోత్సవ ర్యాలీలు కూడా చేస్తున్నారు. మొదటి వారం సక్సెస్ ఫుల్ రన్ పూర్తి చేసుకున్న వెంకీ మామ సెకండ్ వీక్ లోకి ఎంటరైంది. కాగా మొదటి వారానికి గాను వెంకీ మామ నైజాంలో 8.5 కోట్ల షేర్ సాధించింది. ఇక నిన్న నాలుగు చిత్రాలు విడుదల కావడంతో వెంకీ మామకు పోటీ ఎక్కువైంది. మరి ఈ వీకెండ్ వెంకీ మామ చిత్రం ఏ మాత్రపు వసూళ్లతో ముగిస్తుందో చూడాలి.

వెంకీ మామ చిత్రాన్ని దర్శకుడు బాబీ తెరకెక్కించగా సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు.

Exit mobile version