“సైంధవ్” పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో రివీల్ చేసిన వెంకీమామ.!

“సైంధవ్” పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో రివీల్ చేసిన వెంకీమామ.!

Published on Dec 6, 2023 12:49 AM IST


మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ హీరోస్ లో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. మరి ఫ్యాన్స్ అంతా వెంకీ మామగా పిలుచుకునే తాను లేటెస్ట్ గా చేస్తున్న సాలిడ్ పాన్ ఇండియా యాక్షన్ చిత్రమే “సైంధవ్”. మరి భారీ అంచనాలు నడుమ రాబోతున్న ఈ చిత్రం కోసం దగ్గుబాటి అభిమానులు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మేకర్స్ స్టార్ట్ చేసేసారు.

అలా నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “హాయ్ నాన్న” తో కలిసి “సైంధవ్” నుంచి తాను వచ్చారు. మరి ఇందులో వెంకీ మామ మాట్లాడుతూ తమ “సైంధవ్” లో సాలిడ్ యాక్షన్ తో పాటుగా మంచి చాలా చోట్ల ఎమోషన్స్ కూడా చాలా బాగుంటాయి అని తెలిపారు. దీనితో మళ్ళీ తన నుంచి సాలిడ్ యాక్షన్ తో పాటుగా వెంకీ మామ మార్క్ ఎమోషన్స్ ని కూడా ఈ సినిమాలో చూడొచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా నిహారిక ఎంటెర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు