‘వెంకీ మామ’ రిలీజ్ డేట్ కుదిరింది

‘వెంకీ మామ’ రిలీజ్ డేట్ కుదిరింది

Published on Oct 7, 2019 12:05 PM IST

Venky Mama

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇంకో ఒక్క పాట మాత్రమే మిగిలి ఉంది. దీంతో దర్శక నిర్మాతలు విడుదల తేదీని నిర్ణయించారు. డిసెంబర్ మొదటివారంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. కాగా రేపు ఉదయం 11గంటలకి ఈ చిత్ర ఫస్ట్ గ్లిమ్స్ వీడియో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.

ఇందులో చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుండగా, వెంకటేష సరసన పాయల్ రాజ్ పుత్ మెరవనుంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చాలారోజుల నుండి ఊరిస్తూ వస్తున్న వెంకీ, చైతన్యల కాంబినేషన్ కావడంతో ‘వెంకీ మామ’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు