‘వెంకీ మామ’ టాకీ పార్ట్ పూర్తి చేశాడు !

‘వెంకీ మామ’ టాకీ పార్ట్ పూర్తి చేశాడు !

Published on Sep 18, 2019 3:56 PM IST

డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వెంకీ – చైతు కాంబినేషన్ లో ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న మల్టీ స్టారర్ ‘వెంకీ మామ’. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి అయిందట. ఇక కేవలం ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. త్వరలో ఆ సాంగ్ ను కూడా పూర్తి చేయాలని చూస్తుంది చిత్రబృందం. ఇక గతంలో ‘ప్రేమమ్’ సినిమాలో కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న మామ అల్లుళ్లు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమా పై అందరిలోనూ ఆసక్తి అమాంతం పెరిగింది.

ఈ సినిమాలో వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం నుండి ఆ మధ్య ఒక చిన్న మేకింగ్ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో వెంకీ – చైతు లుక్స్ అండ్ మ్యానరిజమ్స్ బాగా ఆకట్టుకోవడంతో సినిమా పై మొత్తానికి ఈ వీడియో బాగానే అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమాన డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు