‘వెంకీ మామ’ ఈ రోజు నుండే మొదలెట్టనున్నాడు !

‘వెంకీ మామ’ ఈ రోజు నుండే మొదలెట్టనున్నాడు !

Published on Nov 12, 2018 9:07 AM IST

యువ సామ్రాట్ నాగచైతన్య – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో ‘వెంకీ మామ’ అనే మల్టీ స్టారర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. కాగా ‘ప్రేమమ్’ సినిమాలో కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న మామ అల్లుళ్లు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తుండంతో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఈ రోజు నుండి రెగ్యూలర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా.. వెంకీకి బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి జోడిగా నటిస్తోంది.

ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కతున్న ఈ చిత్రంలో వెంకటేష్ క్యారెక్టర్ చాలా ఇంట్రస్ట్ గా ఉండనుందట. అలాగే నాగ చైతన్య వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు కూడా బాగా అలరిస్తాయని సమాచారం.

‘జై లవ కుశ ‘ చిత్ర డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి కోన వెంకట్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు