‘వెంకీ మామ’ మూడు రోజుల కలెక్షన్స్ !

‘వెంకీ మామ’ మూడు రోజుల కలెక్షన్స్ !

Published on Dec 16, 2019 9:15 AM IST


వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి బాబీ డైరెక్షన్ లో నటించిన ‘వెంకీ మామ’ చిత్రం శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను సాధిస్తోంది. ఆంధ్ర, నైజాం మరియు సీడెడ్ ప్రాంతాలలో బాక్సాఫీస్ వద్ద వెంకీ మామ గుడ్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఆదివారం నాడు కూడా ఈ చిత్రం రూ .5 కోట్ల ప్లస్ షేర్‌ ను కలెక్ట్ చేసింది. బి.సి సెంటర్స్ లో అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ‘ఏ’ కేంద్రాలలో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ ను సాధించింది.

కాగా మొత్తం 3 రోజుల్లో రూ . 17.78 కోట్ల మార్క్ అధిగమించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా వెంకీ మామ దాదాపు రూ .45 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. దగ్గుబాటి, అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షుకులు కూడా ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. వెంకీ మరియు చైతు ఇద్దరికీ ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఈ రోజు నుంచి వర్కింగ్ డేస్ మొదలయ్యాయి కాబట్టి మరి కలెక్షన్స్ ఎలా వస్తాయో చూడాలి.

ఏపి & తెలంగాణలో ఏరియాల వారిగా మొదటి మూడు రోజుల కలక్షన్ల షేర్ వివరాలు

ఏరియా కలెక్షన్స్
నైజాం Rs 6.72 కోట్లు
సీడెడ్ Rs  3.39 కోట్లు
ఉత్తరాంధ్ర Rs 2.25 కోట్లు
కృష్ణ Rs 1.04 కోట్లు
గుంటూరు Rs 1.50 కోట్లు
నెల్లూరు Rs 0.64 కోట్లు
ఈస్ట్ Rs 1.43 కోట్ట్
వెస్ట్ Rs 0.81 కోట్లు
మొత్తం ఏపి  & తెలంగాణ మొదటి మూడు రోజుల షేర్ Rs 17.78 కోట్లు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు