ఘనంగా ‘వెంకీ పింకీ జంప్’ ఆడియో ఆవిష్కరణ – త్వరలో థియేటర్లలోకి

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై విక్రమ్, రమ్య జంటగా నటించిన చిత్రం ‘వెంకీ పింకీ జంప్’. అజయ్. ఎన్ దర్శకత్వంలో వెంకట్, బాబా నిర్మించిన ఈ సినిమా ఆడియో విడుదల వేడుక ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వి. సముద్ర, బిగ్‌బాస్ ఫేమ్ బెజవాడ బేబక్క, నిర్మాత సాయివెంకట్ ముఖ్య అతిథులుగా హాజరై ఆడియో బిగ్ సీడీని ఆవిష్కరించారు.

ప్రేమ కోసం ఊరు విడిచి పారిపోయిన జంట కథే ఈ చిత్రమని, అన్ని కమర్షియల్ హంగులతో ఆసక్తికరంగా రూపొందించామని దర్శకుడు అజయ్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఆనంద్ రాజా స్వరాలు సమకూర్చడమే కాకుండా, తన కుమారుడు విక్రమ్‌ను హీరోగా పరిచయం చేయడం విశేషం. హీరోగా తెరపై తనను చూసుకుని భావోద్వేగానికి గురయ్యానని, తండ్రి గర్వపడేలా పేరు తెచ్చుకుంటానని విక్రమ్ పేర్కొన్నారు.

అతిథిగా విచ్చేసిన దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రేక్షకులకు కంటెంట్ మాత్రమే ముఖ్యమని, కథ బాగుంటే చిన్న చిత్రాలనైనా ఆదరిస్తున్నారని అన్నారు. సినిమా విడుదల సమయంలో థియేటర్ల విషయంలో తన వంతు సహకారం అందిస్తానని నిర్మాత సాయివెంకట్ హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Exit mobile version