
బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల ప్రవాహం సృష్టిస్తూ సంక్రాంతి విజయంగా మారిన గోపాల గోపాలకి ప్రేక్షకాధారణ పొందుతుంది. ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన వెంకటేష్ తన సోదరుడు సురేష్ బాబు పవన్ కళ్యాణ్ దేవుని పాత్రపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచినట్టు సమాచారం.
మందుగా ఈ సినిమాలో దేవుని పాత్రకోసం పలువురి పేర్లు సంప్రదించారని కానీ సురేష్ బాబు మాత్రం పవన్ ని మాత్రమే తన దృష్టిలో పెట్టుకుని ముందుకి సాగిపోయాడని తెలిపాడు. ఈ పాత్రను పవన్ పోషించినందుకు ధన్యవాదాలు తెలిపాడు. ‘గోపాల గోపాల’కి డాలీ దర్శకుడు. ఈ సినిమా వారం రోజులలో 30కోట్లు సంపాదించింది.