వెండి తెర నవ్వుల చిరునామా వెన్నెల కిషోర్.

vennela kishore1

స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ పుట్టినరోజు నేడు. 1980 సెప్టెంబర్ 19న జన్మించిన ఆయన నేడు 39వ వసంతంలోకి అడిగిడనున్నారు. వెన్నెల కిషోర్ వెండి తెరపై నవ్వుల జల్లులు కురిపిస్తున్నాడు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా వెన్నెల కిషోర్ మారిపోయారు. కొద్దికాలంగా ఆయన లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే భేదం లేకుండా ప్రతి సినిమాలో నటిస్తూ తన మార్కు కామెడీతో హాస్యప్రియుల హాట్ ఫేవరెట్ కమెడియన్ గా మారారు.

గతంలో దర్శకులు బ్రహ్మానందం, అలీ, సునీల్, వేణు మాధవ్, ఎంఎస్ నారాయణ వంటి స్టార్ కమెడియన్స్ కొరకు తమ చిత్రాలలో ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ రాసేవారు. నేటి దర్శకులు వెన్నెల కిషోర్ కొరకు అలా ఓ ప్రత్యేకమైన పాత్రను రాసుకొంటున్నారు. వెన్నెల కిషోర్ తన నటనతో ఖచ్చితంగా నవ్వులు పంచుతాడనే ఒక నమ్మకం అటు దర్శకులలో, ఇటు ప్రేక్షకులలో స్థిరపడిపోయింది. ఏ పాత్రకైనా సరిపోయే బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, టైమింగ్ కామెడీ ఆయనకు ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి.

2005లో విడుదలైన వెన్నెల చిత్రంతో వెండితెరకు పరిచయమైన వెన్నెల కిషోర్ దశాబ్దానికి పైగా అనేక చిత్రాలలో నటించి, తన హాస్యంతో ఆ చిత్ర విజయాలలో కీలకపాత్ర వహించారు. ఇటీవల విడుదలైన నిను వీడని నీడను నేను, మన్మధుడు, సాహో చిత్రాలతో ప్రాధాన్యం ఉన్న పాత్రలలో నటించారు.

Exit mobile version