హాస్య నటుడు ‘వేణు మాధవ్’కు తీవ్ర అనారోగ్యం !

Venu Madhav

తెలుగు చిత్రసీమలో కమెడియన్ గా తనదైన ముద్రను వేసుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో సికింద్రాబాద్ యశోదా హాస్పటల్ లో చేరారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఇక వేణు మాధవ్ మొదటి సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన ‘సాంప్రదాయం’.

అయితే తొలిప్రేమ సినిమాలో అమ్మాయిల పై ఆయన చెప్పిన చాటభారతమంత డైలాగ్ ఆయన్ను ప్రేక్షకులకు బాగా చేరువ చేసింది. ఆ తరువాత దిల్ సినిమాతోనూ ఆయనకు మంచి పేరు వచ్చింది. లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఇంకా ఆయనకు పేరు తెచ్చిన సినిమాలు సై, ఛత్రపతి, మొదలైనవి.

Exit mobile version