అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడవతరం హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానున్న హీరో అఖిల్ అక్కినేని కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో నటించిన మొదటి సినిమా ‘అఖిల్’. అనూప్ రూబెన్స్ – తమన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఆడియో ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దాంతో ఈ చిత్ర టీం గ్రాండ్ గా అఖిల్ ప్లాటినం డిస్క్ వేడుకని నిర్వహించడానికి సిద్దమైందని, అందుకోసం అక్టోబర్ 17వ తేదీనిఫైనలైజ్ చేసారని తెలియజేశాం. గత కొద్ది రోజులుగా ఎక్కడ చేయాలా అనే సందిగ్దంలో ఉన్న ఈ చిత్ర టీం ఫైనల్ గా వైజాగ్ లో చేయాలని ఫిక్స్ చేసింది.
వైజాగ్ గురజాడ కళాక్షేత్రంలో 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి ఈ చిత్ర టీంతో పాటు పలువురు స్టార్స్ కూడా హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే రేపటికల్లా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ఫినిష్ చేసి 16వ తేదీన సినిమాని సెన్సార్ కి పంపడానికి రంగం సిద్దం చేస్తున్నారు. అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాకి నితిన్ నిర్మాత. దసరా కానుకగా అక్టోబర్ 22న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటి వరకూ అక్కినేని ఫ్యామిలీ అంటే ఉన్న లవ్ బాయ్ ఇమేజ్ ని చెరిపేయాలనే ఉద్దేశంతో అఖిల్ తన మొదటి సినిమా ‘అఖిల్’ని పూర్తి కమర్షియల్ యాంగిల్ లో ఉండేలా చూసుకున్నాడు.
