భరత్ అనే నేను’ ఆడియో వేడుక ఎక్కడంటే !

ఏప్రిల్ 20న విడుదలకానున్న ‘భరత్ అనే నేను’ ఆడియో వేడుక ఏప్రిల్ 7న జరగనున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ వేడుకను వైజాగ్లో నిర్వహించాలని అనుకున్నా కుదరక హైదరాబాద్లోనే చేయనున్నారు. వేడుకకు భారీగా అభిమానులు హాజరయ్యే అవకాశాలుండటం మూలాన నగరంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుండి ఇప్పటికే ‘భరత్ అనే నేను’ పాట విడుదలై బ్రహ్మాండమైన స్పందనను దక్కించుకోగా మిగతా పాటలు ఎలా ఉంటాయో వినాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని హ్యాట్రిక్ హిట్లతో విజయపథంలో దూసుకుపోతున్న డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేయడం జరిగింది.