ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సిద్దమైన సూర్య మూవీ

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సిద్దమైన సూర్య మూవీ

Published on Sep 12, 2019 4:10 PM IST

మోహన్ లాల్, సూర్య, ఆర్య ప్రధాన పాత్రలలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ బందోబస్త్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై దర్శకుడు కెవి ఆనంద్ మల్టీ స్టారర్ గా రూపొందించారు. ఈనెల 20న తెలుగు తమిళ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధమైంది. రేపు సాయంత్రం హైదరాబాద్ లోని మాదాపూర్ నందు గల ఐటీసీ కోహినూర్ నందు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుక జరుపనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ప్రకటన చేయడం జరిగింది.

సూర్య సరసన సయేశా నటిస్తున్న ఈ చిత్రంలో సూర్య దేశభద్రతకు పనిచేసే కమాండో ఆఫీసర్ గా చేస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాని పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం గత నెల 30న విడుదల కావాల్సివుండగా సాహో విడుదల కారణంగా వాయిదాపడింది. బందోబస్త్ చిత్రానికి హరీష్ జయ్ రాజ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు