మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు మాస్ హీరోలతో అంతే మాసివ్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇపుడు సాలిడ్ ప్రమోషన్స్ ప్లానింగ్స్ తో బిజీగా ఉంది.
ఇక ఈ చిత్రం నుంచి సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఇచ్చిన ఒక్కో సాంగ్ కూడా సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా అంతే గ్రాండ్ గా సాలిడ్ బీట్స్ ఇచ్చారు. ఇక వాటిలో పక్కా మాస్ సాంగ్ “నాటు నాటు” అయితే వేరే లెవెల్లో రెస్పాన్స్ ని కొల్లగొట్టింది.
మరి లేటెస్ట్ గా అయితే ఈ సాంగ్ అన్ని భాషల్లో కలిపి ఏకంగా 101 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకొని బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సాంగ్ కి గాను తెలుగు మరియు హిందీ భాషల్లో గట్టి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఫుల్ సాంగ్ వచ్చాక పూనకాలే ఉంటాయని చెప్పాలి. మరి అది తెలియాలి అంటే వచ్చే జనవరి 7వరకు ఆగాల్సిందే.
The song of the decade #RRRMassAnthem hits 101Million+ views across all languages only on YouTubehttps://t.co/nz2cnlwObq
????@mmkeeravaani #RRRMassAnthemhits100M#RRRMovie@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies @RRRMovie @laharimusic @TSeries pic.twitter.com/qQXV5o32OW
— LahaRRRi Music (@LahariMusic) December 17, 2021