సింగర్ గా మారిన అలనాటి స్టార్ హీరోయిన్

jayaprada
‘అడవి రాముడు’, ‘సాగర సంగమం’, ‘మేఘసందేశం’ లాంటి టాలీవుడ్ ఎవర్గ్రీన్ క్లాసిక్స్ లో నటించిన అలానాటి స్టార్ హీరోయిన్ జయప్రద. ఈ స్టార్ హీరోయిన్ అప్పట్లోనే తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, బెంగాలీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. నటిగానే కాకుండా రాజకీయాల్లో కూడా రాణించిన జయప్రద మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తోంది. ఇప్పటి వరకూ నటిగానే మెప్పించిన జయప్రద ఇప్పుడు సింగర్ గా అవతారం ఎత్తింది.

సింగర్ గానా.? ఏ భాష.? ఏ సినిమా.? అనే విషయాలలోకి వెళితే జయప్రద రీసెంట్ గా తమిళంలో ఓ పాట పాడి సింగర్ గా మారింది. అది కూడా నార్త్ ఇండియా సెన్సేషనల్ సింగర్ జావేద్ అలీతో కలిసి తమిళ సినిమా ‘ఉయిరే ఉయిరే’ సినిమా కోసం పాట పాడింది. జయప్రద బంధువైన సిద్దు హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా తెలుగులో హిట్ అయిన ఇష్క్ సినిమాకి రీమేక్. జయప్రద నిర్మిస్తున్న ఈ సినిమాలో హన్సిక హీరోయిన్. మరి నటిగా గుర్తింపు తెచ్చుకున్న జయప్రద సింగర్ గా కూడా మెప్పిస్తుందేమో చూడాలి. ఇది కాకుండా జయప్రద ప్రస్తుతం బాలీవుడ్, బెంగాలీ, మలయాళ సినిమాల్లో నటిస్తోంది.

Exit mobile version